కావలసిన పదార్థాలు :
నూడుల్స్... పావు కేజీ
పాలకూర తురుము అర కప్పు
పచ్చిమిర్చి... మూడు
టొమాటో ముక్కలు... పావు కప్పు
ఉప్పు... సరిపడా
మసాలా పొడి... అర టీ.
మంచినీళ్లు.... పావు లీ.
తయారీ విధానం :
బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి. నూడుల్స్ వేసి అవి ఉడికిన తరవాత పాలకూర తురుము, టొమాటో ముక్కలు, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, ఉప్పు, మసాలా పొడి.. అన్నీ వేసి నీళ్లన్నీ ఇగిరిపోయేవరకూ ఉడికించి దించాలి. అంతే నోరూరించే పాలక్ నూడుల్స్ సిద్ధమైనట్లే...! వీటిని టొమాటో సలాడ్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.