కావలసిన పదార్థాలు :
పనీర్ ముక్కలు... పావు కేజీ
వెజ్ నూడుల్స్... పావు కేజీ
నూనె... 50 గ్రా.
ఉల్లికాడల తురుము... రెండు కట్టలు
క్యారెట్, బీన్స్ ముక్కలు... చెరో 50 గ్రా.
టమోటో, రెడ్ చిల్లీ సాస్లు... చెరో రెండు టీ.
వెల్లుల్లి ముద్ద... రెండు టీ.
కొత్తిమీర తురుము... ఒక టీ.
మిరియాలపొడి... అర టీ.
టేస్టింగ్ సాల్ట్... పావు టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
పనీర్ ముక్కల్ని నూనె వేయకుండా వేయించి తీయాలి. కడాయిలో నూనె వేసి కాగాక వెల్లుల్లి ముద్ద, ఉల్లికాడల తురుము, బీన్స్, క్యారెట్, పనీర్ ముక్కలు వేసి కలపాలి. తరువాత రెడ్ చిల్లీ, టొమాటో సాస్లు వేసి మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, ఉప్పు వేసి మీడియం సెగమీద గరిటెతో కలపాలి. చివరగా ఉడికించి పొడిపొడిగా చల్లార్చిన నూడుల్స్ కూడా వేసి బాగా కలిపి, కొత్తిమీర చల్లి వడ్డించాలి. అంతే పనీర్ నూడుల్స్ రెడీ అయినట్లే...!