కావలసిన పదార్థాలు :
టైగర్ రొయ్యలు... అర కేజీ
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... అర టీస్పూను
చిల్లీసాస్... 3 టీ.
కోడిగుడ్డు... ఒకటి
కార్న్‌ఫ్లోర్... రెండు టీ.
మైదా... రెండు టీ.
నూనె... వేయించడానికి సరిపడా
వెన్న... 50గ్రా.
వెల్లుల్లి... 30గ్రా.
తయారీ విధానం :
పొట్టు తీసిన రొయ్యల్ని శుభ్రంగా కడిగి చేదు తీసేయాలి. తరవాత నీళ్లు వంపేసి రొయ్యల్లో తగినంత ఉప్పు, మిరియాలపొడి, చిల్లీసాస్, కోడిగుడ్డు, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి. మందపాటి బాణలిలో నూనె వేసి కాగిన తరవాత రొయ్యల్ని కొద్దికొద్దిగా వేసి బాగా ఎర్రగా వేయించి తీయాలి.
మరో బాణలిలో వెన్న వేసి కరిగాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. తరవాత అందులోనే వేయించి తీసిన రొయ్యల్ని కూడా వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. అంతే టైగర్ ప్రాన్స్ స్పెషల్ సిద్ధమైనట్లే..!