కావలసిన పదార్థాలు :
నల్ల ద్రాక్ష (బ్లాక్ గ్రేప్స్)... పావు కేజీ
పంచదార... అరకేజీ
మైదా... అర కేజీ
నెయ్యి... పావు కేజీ
తయారీ విధానం :
మైదాపిండిలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈపిండిలో ఆరు కప్పుల నీళ్లుపోసి బాగా కలపాలి. ఈ పాలను కాసేపు అలాగే ఉంచితే నీళ్లు పైకి తేలుతాయి. వాటిని వంపేస్తే, అడుగున్న చిక్కటి పాలు నాలుగు కప్పుల దాకా మిగులుతాయి, వీటిని అలాగే పక్కన ఉంచాలి.
ద్రాక్షలో గింజలు తీసివేసి మిక్సీలో వేసి జ్యూస్‌లాగా చేయాలి. ఇప్పుడు విడిగా మరో మందపాటి గిన్నెలో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి జిగురుపాకం రానివ్వాలి. ఆపై అందులో మైదాపాలు, ద్రాక్షరసం వేసి దగ్గరగా అయ్యేదాకా ఉడికించాలి. బాగా ముద్దలాగా అయిన తరువాత అందులో నెయ్యి వేసి, గట్టిపడేదాకా ఉడికించి దించేయాలి. చివరిగా ఈ మిశ్రమాన్ని నెయ్యిరాసిన ఓ ప్లేటులో పోసి సమంగా సర్ది, ఆరిన తరువాత కావాల్సిన రీతిలో ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.