కావలసిన పదార్థాలు :
బియ్యం... పావు కేజీ
మంచినీరు... రెండు గ్లాసులు
కోడిగుడ్లు... నాలుగు
వెనిగర్... ఒక టీ.
మిరియాల పొడి... అర టీ.
ఉప్పు... తగినంత
సోయా సాస్... రెండు టీ.
నూనె... రెండు టీ.
తయారీ విధానం :
ముందుగా అన్నం వండి చల్లార్చాలి. ప్రెషర్ పాన్‌లో 2 టీస్పూన్ల నూనె పోసి కాగాక కోడిగుడ్ల సొనల్ని వేసి పావు టీస్పూను ఉప్పు, చిటికెడు మిరియాలపొడి చల్లి అది పొరుటులా పొడిపొడిగా అయ్యేవరకూ గరిటెతో తిప్పుతూ వేయించి దించాలి. దీన్ని కొద్దిసేపు పక్కన ఉంచాలి.
మరో బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక అన్నం, కోడిగుడ్ల మిశ్రమం, సోయా సాస్, వినెగర్, ఉప్పు, మిరియాలపొడి వేసి కలుపుతూ స్టవ్‌మీద ఓ రెండు నిమిషాలు వేయించి దించాలి. ఇది వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. చైనీస్ స్టయిల్లో చాలా సులభంగా తయారయ్యే ఈ వంటకాన్ని మీరూ తయారు చేస్తారు కదూ..!