గరం.. గరం.. "సేమ్యా కట్‌లెట్" హుర్రే...!!
కావలసిన పదార్థాలు :సేమ్యా... రెండు కప్పులుబంగాళాదుంపలు.. అర కేజీఉల్లిపాయలు.. పావు కేజీమైదా పిండి.. అర కప్పుఅల్లం.. చిన్నముక్కకొత్తిమీర.. ఒక కట్టనిమ్మరసం, గరంమసాలా... చెరో రెండు టీ.ఉప్పు.. తగినంతకొత్తిమీర.. ఒక కట్టపచ్చిమిర్చి.. సరిపడాతయారీ విధానం :ఒగ గిన్నె తీసుకుని అందులో ఆరు కప్పుల నీటిని పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత అందులోనే శుభ్రం చేసిన సేమ్యాను వేసి ఉడికించాలి. సేమ్యా ఉడికిన తరువాత నీటిని వార్చేసి విడిగా ఆరబెట్టాలి. బంగాళాదుంపల్ని ఉడికించి, పైన తొక్క తీసి మెత్తగా నలుపుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీరలను సన్నగా తరిగి ఉంచాలి.అల్లం, పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బాలి. మైదాపిండిలో తగినంత ఉప్పువేసి మెత్తగా కలుపుకోవాలి. దీంట్లో బంగాళాదుంప ముద్ద, అల్లంపచ్చిమిర్చి ముద్ద, ఉడికించిన సేమియా, నిమ్మరసం వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కట్‌లెట్‌ల మాదిరిగా వత్తి, పెనం వేడి చేసి దాంట్లో కట్‌లెట్‌లను ఉంచి రెండువైపులా నూనె వేస్తూ ఎర్రగ వేయించి తీసేయాలి. వీటిని వేడిగా ఉన్నప్పుడే టొమోటో సాస్‌తో కలిపి తింటే సూపర్బ్‌గా ఉంటాయి.