కావలసిన పదార్థాలు :
చక్కెర.. 2 పెద్ద టీ.
క్యారమెల్ కోసం మంచినీరు.. ఒక పెద్ద టీ.
పాలు.. 600 మి.లీ.
గుడ్లు.. నాలుగు
వెనీలా ఎసెన్స్.. అర టీ.
తయారీ విధానం :
గుడ్లు సొన, చక్కెర, ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఒకపక్క స్టౌమీద పాలు కాంచుతూ.. మరోవైపు చక్కెర నీళ్లు మరిగిస్తుండాలి. చక్కెర పాకం గోధుమరంగులోకి వచ్చాక దించి కాస్తంత బేకింగ్ డిష్‌లోనూ.. మిగిలినది ఒక ప్లేటులోనూ వేసి పరచాలి. కాగుతున్న పాలల్లో గుడ్డు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలియబెట్టాలి.
బేకింగ్ డిష్‌లో ఉన్న క్యారమెల్ (చక్కెర పాకం) మీద పాల మిశ్రమాన్ని పోసి.. దాన్ని మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉంచి బేక్ చేయాలి. చాకుకు అంటని విధంగా ఉన్నప్పుడు దాన్ని ఓవెన్‌లోంచి బయటకు తీసి ముక్కలుగా కోసి సర్వింగ్ ప్లేట్స్‌లో సర్ది.. పైన ఇందాక ప్లేటులో పరచి ఉంచిన క్యారమెల్‌ను ముక్కలుగా చేసి వాటిపై అలంకరించి సర్వ్ చేయాలి.