కావలసిన పదార్థాలు :
మటన్ కీమా... అర కేజీ
శెనగపప్పు... 150 గ్రా.
గరంమసాలా... రెండు టీ.
కొత్తిమీర... ఒక కట్ట
పుదీనా... ఒక కట్ట
పచ్చిబొప్పాయి... చిన్న ముక్క
గుడ్లు... రెండ్లు
కారం... ఒక టీ.
ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
గరంమసాలా, సెనగపప్పు, కీమా కలిపి కుక్కర్‌లో పెట్టి రెండు కూతలు వచ్చేవరకూ ఉడికించాలి. కారం, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, తురిమిన బొప్పాయి, గిలకొట్టిన కోడిగుడ్డు... అన్నీ ఉడికించిన కీమాలో కలపాలి. కీమా మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని అరిచేతిలో వేళ్లతో వత్తి నూనెలో ఎర్రగా వేయించాలి. నిమ్మరసం చల్లిన పచ్చి ఉల్లిపాయలు నంజుకుంటూ ఈ కీమా కబాబ్‌లు లాగిస్తూ... ఆహా ఏమి రుచి అనకుండ ఉండలేరు. మీరూ తిని చూడండి మరి...!