వేసవిలో చంటి పిల్లల దాహం తీర్చేందుకు కొన్ని చిట్కాలు!!
వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయ్. ఒకవైపు.. ఉక్కపోత.. మరోవైపు దాహంతో పెద్దవారే అల్లాడిపోతున్నారు. పది గంటలకు పైబడి కాలు బయటపెట్టేందుకు పిన్నలు పెద్దలు సాహయం చేయలేక పోతున్నారు. ఇలాంటి వేసవి కాలంలో చంటి పిల్లలకు ఎక్కువ దాహం అవుతుంది. ఈ దాహాన్ని తీర్చడంపై బాలింతలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి కాలంలో బాలింతలతో పాటు గృహిణిలు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిదని వారు చెపుతున్నారు. వేసవిలో కాచి చల్లార్చిన నీటిని చిన్న సీసాలో పోసి చంటిపిల్లలకు తాగించాలి. ఎండ సమయంలో పంచదార ఉప్పు కలిపిన నీరు తాగిస్తే చాలా మంచిదని చెపుతున్నారు. పిల్లలకు ఖర్జూరం పళ్లను కొన్నిటిని నీళ్ళను నానవేసి ఆ నీరు ఎండాకాలంలో తాగిస్తే మరీ మంచిదట. పిల్లలకు అప్పుడప్పుడు కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు నిమ్మరసం తాగించాలని కోరుతున్నారు. రెండు లేదా మూడు నెలల పిల్లలకు కూడా పళ్ళరసం తాగించడం మంచిది. ఐదు లేదా ఆరు నెలల పిల్లలకు తినగలిగిన పళ్ళను ఆహారంగా ఇవ్వవచ్చు. మామూలుకంటే ఎండాకాలంలో ఎక్కువగా పళ్ళు తినిపించడం మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు.