మీ పిల్లల బూట్లు... చిన్నవా..? పెద్దవా...?
పిల్లల కాళ్లు త్వరగా ఎదుగుతాయి. వాటితోపాటే పాదాలు కూడా. వాళ్ల బూట్లని త్వరత్వరగా మార్చాల్సి వస్తుంది. సైజులు మారడంతో ఈ సమస్య అధిగమించడానికి సాధారణంగా తల్లిదండ్రులు సరిపోయే సైజుకన్నా కొంచెం పెద్దవి కొంటారు. కానీ పిల్లల పాదాల అసలు సైజుకన్నా మీరు కొనే పెద్ద బూట్లు లేదా చిన్నబూట్లు నడిచేటపుడు కాళ్లకు సరైన సపోర్ట్ ఇవ్వవు. దాంతో బూట్లకి ఎడ్జెస్ట్ అవుతూ నడిచే వంకరటింకర నడకతో పిల్లల నడక తీరు మారుతుంది. పాదాలకన్నా ఎక్కువ తక్కువ సైజుల వల్ల నడిచేటపుడు కాళ్లు మడత పడటం, మెలికె పడటం, జారడం వంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి పాదాలు సరైన పెరుగుదలకోసం సమయానికి తగ్గట్లుగా సైజులు చూసి బూట్లు కొనడమే కాక ఏడాదికేడాది వాటిని మారుస్తూ ఉండటం మంచిది.