బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని పిల్లలకు ఊబకాయం వస్తుందా..?
* ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) తీసుకోని పిల్లలు ఊబకాయంబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూగానీ లేదా వారానికి రెండుసార్లుగానీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని పిల్లలకు ఊబకాయం వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయని వారంటున్నారు.* ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నట్లయితే మధ్యాహ్న భోజన సమయంలోపు చిరుతిళ్ల జోలికి వెళ్లరనీ, అలాగే భోజన సమయంలో కూడా తక్కువగా తినగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. తద్వారా చిన్నారుల్లో ఊబకాయం రాకుండా కాపాడుకోవచ్చుననీ, దాంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారని వారంటున్నారు.* తీరికలేని టైంటేబుల్‌తో సతమతం అవుతుండే చిన్నారులు బ్రేక్‌ఫాస్ట మానేయటంవల్ల సాధారణంగానే మధ్యాహ్న భోజన సమయానికల్లా ఆకలి దంచేస్తుంది. దీంతో ఆకలికి తట్టుకోలేక చిరుతిళ్లబారిన పడుతుంటారు. అయితే చిరుతిళ్లలో ఎక్కువస్థాయిలో కొవ్వు పదార్థాలు, చక్కెర కలిసున్న కారణంగా క్రమంగా పిల్లలు అధిక బరువుకు గురవుతారు. దీన్ని అరికట్టాలంటే పిల్లలకు ఉదయాన్నే తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.