Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాణాయామంతో పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత..!

Advertiesment
చైల్డ్ కేర్
FILE
* ప్రాణాయామం చేయటంవల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. క్రమం తప్పకుండా దీన్ని చేస్తే అతినిద్ర, మందకొడితనం, అలసత్వం, బద్ధకం, నిరుత్సాహం లాంటివి దరి చేరకుండా పిల్లల్ని ఎల్లప్పుడూ చురుకుగా ఉండేటట్లు చేస్తుంది.

* ప్రాణాయామం ఎలా చేయాలంటే.. చంద్ర భేద: కుడివైపు ముక్కు రంధ్రాన్ని వేలితో నొక్కిపట్టి ఎడమవైపు ముక్కు రంధ్రంతో గట్టిగా గాలి పీల్చి అదే రంధ్రం ద్వారా శ్వాసను బయటికి వదలాలి. సూర్య భేద: ఇప్పుడు ఎడమవైపు ముక్కు రంధ్రాన్ని వేలితో నొక్కిపెట్టి కుడివైపు ముక్కు రంధ్రంతో గాలి పీలుస్తూ, సరిగ్గా చంద్ర భేధకు చెప్పినట్లుగానే చేయాలి.

* శీతలి: ముక్కును వేలితో నొక్కిపట్టి, నోటి ద్వారా గాలి పీల్చుకుని ముక్కు ద్వారా శ్వాసను బయటికి వదలాలి. శీతకరి: నోరు తెరచి, పళ్లను బిగించి ముక్కును వేలితో నొక్కిపట్టాలి. గాలిని దవడల ద్వారా పీల్చుకోవాలి. ఇప్పుడు నోరుమూసిపెట్టి ముక్కు ద్వారా శ్వాసను బయటికి వదలాలి.

* భ్రమరి: మునివేళ్లతో చెవులు మూయాలి. కళ్లు మూసుకుని ముక్కు ద్వారా గట్టిగా గాలి పీల్చుకోవాలి. ఇప్పుడు శ్వాసను ముక్కు ద్వారా బయటికి వదలిపెడుతున్నప్పుడు నోటితో "హమ్‌మ్‌మ్" అంటూ శబ్దం చేయాలి. పరీక్షల సమయంలో, పరీక్షలకు తయారయ్యేటప్పుడు ఈ ప్రాణాయామం చేయటంవల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ముఖ్యంగా భ్రమరి చేయటంవల్ల మెదడు ఎంతో ఉపశమనాన్ని పొందుతుంది. ఇది చేసిన వెంటనే ఉపయోగం మీకు కనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu