Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలి..

Advertiesment
చైల్డ్ కేర్
FILE
* పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలంటే.. ముందుగా వారి జ్ఞాపక శక్తిపై వారికి నమ్మకం, ఆశావహ దృక్పథం ఉండాలి. అలాగే ఇంట్లో పరిస్థితులు కూడా సక్రమంగా ఉండాలి, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. పిల్లలూ.. జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు మీకు అర్థమయ్యే పాఠ్య పుస్తకాలనే ఎన్నుకోవాలి. ఇంగ్లీషు అక్షరాలను అన్వయించి ఫార్మూలాలను, లెక్కల్ని కనుక్కోవటం లాంటివి చేసి చూడాలి.

* ఒక లింకు పద్ధతి ద్వారా పాఠాలను గుర్తించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఫార్మూలాలను కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇంగ్లీష్ భాషలో పదాలను గుర్తు పెట్టుకోవటం.. పదాలు, అంకెలను విడగొట్టడం, బట్టీ పట్టడం, విషయాలను కుదించి రాయటం, ఫ్లాష్ కార్డులను ఉపయోగించటం లాంటివి చేయటంవల్ల కూడా జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

* అలాగే వివిధ రేఖాపటాల ద్వారా అనేక విషయాలను గుర్తుంచుకోవటం.. పదం లేక వాక్యాల తాలూకు బొమ్మను మనసులో ఉంచుకుని జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేయటం లాంటివి చేయాలి. ఏ విషయాలను గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారో, ఆ పదాలను ఒక అర్థవంతమైన వాక్యంగా తయారు చేసి జ్ఞాపకం ఉంచుకోవాలి.

* ఆటల ద్వారా కూడా రకరకాల విషయాలను జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కథల రూపంలో పేర్చుకుని గుర్తు పెట్టుకోవడం.. పంచేంద్రియాల ద్వారా, హాస్యం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకునేలా ప్రయత్నించాలి. అర్థం చేసుకుని చదవడం అనేది ఒక మంచి టెక్నిక్. ఇలా అర్థం చేసుకుని చదవడం వల్ల విషయాలు సులభంగా జ్ఞప్తికి వస్తాయి. ఒక విషయం గురించి చిన్న చిన్న కాగితాలపై సంక్షిప్తంగా రాయడం ద్వారా కూడా జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.

Share this Story:

Follow Webdunia telugu