ఎండాకాలంలో చిన్నారులు పెద్దవారితో పోటీపడుతూ ఈత ఆడేందుకు ఇష్టపడతారన్నది తెలిసిన విషయమే. అయితే ఈతకు వెళ్లేముందు తప్పనిసరిగా వారి చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ అప్లయి చేసి పంపించాలి.
అలాగే ఈత ముగిసిన తరువాత వారు ఇంటికిరాగానే మామూలు నీటితో స్నానం చేయించి, మళ్లీ వారి చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్‌ను పట్టించాలి. ఇలా చేసినట్లయితే వారి చిన్నారి చర్మం సున్నితంగా, అందంగా ఉంటుంది.