పిల్లలు పరీక్షలకు వెళ్లే ముందు ఏం చేయాలి..?
* పిల్లల పరీక్షలకు ముందు పిల్లలూ, ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ కలిసి కూర్చుని, పరీక్షల భయాన్ని పోగొట్టాలి. భయం లేకుండా పిల్లలు పరీక్షల కోసం తయారయ్యే వారిని గురించి తెలుసుకోవాలి. దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. పరీక్షల ముందు విపరీతంగా చదవడం, రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉండి చదవడం మంచిది కాదు. పరీక్షల ముందు కొత్త పాఠాలు చదివి అర్థం చేసుకుంటూ బెంగలో పడటం కన్నా, రొటీన్‌గా చదువుకునే వాటిని క్రమపద్ధతిలోకి తీసుకురావడం మేలు.* ముందుగా చదువుకునేందుకు, ఒక చక్కని స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ చోటికి దగ్గరలో టీవీ ఉండకూడదు, ఎలాంటి సందడీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పాటలు వినడం మానేయాలి. అంతగా వినాలనిపిస్తే, శాస్త్రీయవాద్యసంగీతం వినవచ్చు. మరో ముఖ్యమైన విషయం, రాత్రి పూట మేలుకుని ఉండి, పక్క మీద పడుకుని చదవడం కూడదు, చదువుకు బల్ల, కుర్చీ మేలైనవి. వీటి వల్ల ఏకాగ్రతకు భంగం కలగదు. చదువుకునేందుకు చక్కని భంగిమ కూడా అమరుతుంది.