పిల్లలకు వారి ప్లేటులో భోజనం వడ్డించేటప్పుడు వారికి కొద్దిగా పెట్టండి. మరీ ఎక్కువ కావాలంటే వారే అడిగి పెట్టించుకునేలా అలవాటు చేయండి. ఒకేసారి ఎక్కువగా భోజనం వడ్డించేందుకు మాత్రం అలవాటు చేయకండి. అలా వడ్డిస్తే వారు దానిని పూర్తిగా తినలేరు. ఆ భోజనం కాస్త వృధా అవుతుంది.
అలాగే వారు ప్రతి సారీ చూసిన ఆహారపదార్థాలను ఎక్కువగానే కోరుకుంటుంటారు. అలాంటివాటిని వారికి అలవాటు చేయకండి. ప్రతి ఆహార పదార్థం వారికి తినిపించేలా చేయండి. దీంతో పిల్లలకు అన్ని రకాల పోషక పదార్థాలు తినిపించడానికి తల్లిదండ్రులుగా మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచండి. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా, చలాకీగా ఉంటారని వైద్యులు తెలిపారు.