పిల్లలకు పోషక పదార్థాలు ఉండే అల్పాహారం ఇవ్వాలి!
, సోమవారం, 26 మార్చి 2012 (16:35 IST)
ఉదయాన్నే ఏదో ఒకటి తినేయడం అని కాకుండా ఆరోగ్యవంతమైన బ్రేక్‌ఫాస్ట్‌ను ఎంచుకుని పెడితే మరిన్ని పోషకాలు అందుతాయి. సెరల్స్‌లో కార్బోహైడ్రేట్స్, పీచు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లలకు చాలా మంచి ఆహారం. వీటితో పాటు పాలు ఇస్తే అవసరమైన కాల్షియం, ప్రొటీన్ లభిస్తుంది.* ఒకకప్పు పెరుగు, పండుముక్క ఇవ్వచ్చు.* కూరగాయముక్కలతో ఆమ్లెట్ చక్కని ప్రత్యామ్నాయ ఉపాహారం.* చల్లని ఈ శీతాకాల ఉదయాలకు గ్రీన్ పరోటాలు ఎక్కువ మేలు చేస్తాయి. మెంతి ఆకులు ఇతర ఆకులేవైనా గోధుమపిండిలో వేసి కలిపి పరోటాలు చేసి పెడితే కలర్‌ఫుల్‌గా మాత్రమే కాదు, అత్యంత పోషకాలతో నిండి ఉంటాయి.* ఉదయం టోస్టు ఇష్టపడే పిల్లలకు హోల్‌మీల్ బ్రెడ్‌పై బట్టర్, జామ్ లేదా పీనట్‌బట్టర్ పరిచి ఇచ్చి, ఓ గ్లాసు పండ్లరసాన్ని ఇస్తే సరిపోతుంది. దీనిలో పోషకాలు, పీచు సమృద్దిగా లభిస్తాయి. పీచు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నందున పిల్లలకు ఎక్కువసేపు పొట్టనిండుగా ఉండి పిచ్చి చిరుతిండ్ల వైపు చూడరు.* ఆరోగ్యవంతమైన మిల్క్‌షేక్ చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. ఉడకబెట్టినగుడ్డు, బాదంపప్పుకూడా మంచి ఉపాహారంలో భాగాలు.* ఇడ్లీ, పోహ, ఉప్మా బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రత్యామ్నాయం.* పిల్లలకు బ్రేక్‌ప్రాస్ట్ కీలకమైన ఆహారం. పిల్లలు ఏం తినకుండా స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళిపోతే శరీరంలో గల శక్తినిల్వల్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిల్వశక్తి స్ట్రెస్ హార్మోన్ ద్వారా విడుదలవుతుంది. కాబట్టి పిల్లలు అలసటగా, విసుగ్గా, చిరాగ్గా మారిపోవడం మనం గమనిస్తాం.