Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలకు ఇవి నేర్పండి...!

Advertiesment
బాలప్రపంచం చైల్డ్కేర్ పిల్లలు తల్లిదండ్రులు ప్రేమ మానసిక వైద్యనిపుణులు సంస్కారం హోంవర్క్ నీతి నియమాలు కథలు

Gulzar Ghouse

తమతమ పిల్లలను ప్రతి తల్లిదండ్రులు ప్రేమిస్తుంటారు. అందునా చిన్న పిల్లలైతే మరీనూ... వారికి అన్నీ తామేనన్నట్లు వారితో వ్యవహరిస్తుంటారు. కాని వారికి అలా అలావాటు చేయడం అంతమంచిది కాదంటున్నారు మానసిక వైద్యనిపుణులు. ప్రతి చిన్న విషయానికి పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడటం అంతమంచిది కాదంటున్నారు వారు. దీంతో పిల్లలు సోమరిపోతులుగా మారిపోతారని, చివరికి వారి పనులు వారు చేసుకోవడానికికూడా తల్లిదండ్రులపై ఆధారపడుతుంటారని మానసిక వైద్యనిపుణులు సూచించారు.

పిల్లలపై ప్రేమ అనేది మరీ వారిని సోమరిపోతులుగా తయారు చేయకూడదు. వారికి సంస్కారం, నీతి, నియమాలగురించి వివరించి నేర్పిస్తుండాలి. వారికి నీతి కథలు, ధర్మానికి సంబంధించిన కథల పుస్తకాలు ఇవ్వడమే కాకుండా వాటికి సంబంధించిన విశ్లేషణలు కూడా వివరిస్తుండాలంటున్నారు నిపుణులు. మీ పిల్లవాడు ఆత్మస్థైర్యంతో మెలగాలనుకుంటే వారికి కొన్ని చిట్కాలు మీకోసం--

** ప్రతి పని పిల్లలు తామే స్వయంగా చేసుకునేలా వారిని ప్రోత్సహించాలి. అలాగే వారు చేసే పనిలో మీరుకూడా సహాయపడవచ్చు.

** పిల్లలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుండాలి. అందునా వారు ఏదైనా పనిలో తప్పటడుగు వేస్తే వారిని మంచిగా మందలించి, అందులోని తప్పును ఎత్తి చూపడం కాకుండా దానికి సులభమైన పరిష్కారం ఏంటో వారికి వివరించాలి.

** పిల్లల్లో ప్రతీకార భావనను ప్రోత్సహించకండి. వారికి స్నేహం, ప్రేమ, సద్భావన, దేశం పట్ల ప్రేమకు సంబంధించిన పాఠాలను నేర్పండి. లేదా వాటికి సంబంధించిన పుస్తకాలను కొని ఇవ్వండి. వాటిని చదివించడానికి ప్రయత్నించండి. వారితోబాటు మీరుకూడా ఆ పుస్తకాలు చదివితే వారిలో పట్టుదల వస్తుంది. అందులో ఏవైనా సందేహాలు వస్తే వెంటనే వాటిని తీర్చడానికి మీరు సిద్ధంగా ఉండండి.

** పిల్లలు తమ హోంవర్క్‌ను తామే చేసుకునేలా ప్రోత్సహించాలి. వారు హోంవర్క్ చేయకపోతే ఎట్టిపరిస్థితులలోనూ వారి హోంవర్క్‌ను మీరు చేయకండి. టీచర్లు వారిని మందలించినాకూడా వారి మంచికోసమేననేది తల్లిదండ్రులుగా మీరు గుర్తించాలి.

** పిల్లలు అడిగే ప్రతి వస్తువు కొనిచ్చే అలవాటును మానుకోండి. చిన్నప్పటినుండే డబ్బును పొదుపు చేసే అలవాటును వారికి నేర్పించండి.

** పిల్లలకు సంస్కారం అనేది వారి కుటుంబంనుంచే అలవడుతుంది. మీరు తమ పిల్లలను సంస్కారవంతులుగా మార్చాలనుకుంటే వారికి పెద్దలపట్ల గౌరవ భావం కలిగేలా చూడండి. ఎట్టిపరిస్థితులలోనూ ఇతరులగురించి వారిముందు విమర్శించకండి.

Share this Story:

Follow Webdunia telugu