పిల్లల ఇంటర్నెట్ బ్రౌజింగ్ మానసిక వ్యవసనమా..?
* వీలు దొరికితేచాలు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయటం, కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటూ ఉండటం, వీడియో గేమ్స్ ఆడటం.. లాంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపిస్తే, అదే క్రమంగా వారు మానసిక వ్యసనానికి గురయ్యే ప్రమాదం ముంచుకొస్తోందని పెద్దలు అర్థం చేసుకోవాలి.* కంప్యూటర్ గేమ్స్, వీడియోగేమ్స్ వ్యవసంవల్ల పిల్లలు అనారోగ్యానికి గురికావటం మాత్రమే కాకుండా.. హింసాప్రవృత్తి, దూకుడుతనం లాంటి మానసిక అనారోగ్యానికి కూడా గురవుతారు. ఈ సమస్యలతో సతమతం అయ్యే చిన్నారుల్లో మూర్చవ్యాధి ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే జీవక్రియ వేగం పెరగటం, చేతులకు రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజురీ లాంటి సమస్యలు సైతం పెరుగుతాయంటున్నారు.* కంప్యూటర్ వ్యసనంతో సతమతం అయ్యే చిన్నారులు హోంవర్క్, చదువుసంధ్యలలో వెనుకబడటమేగాక.. కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అతిగా గేమ్స్ ఆడటాన్ని వ్యసనంలాగానే పరిగణించాలని.. అలా ఎప్పుడైతే గుర్తిస్తారో, అప్పుడే పిల్లల్ని దాన్నుంచి బయటకు తెచ్చేందుకు పెద్దలు ప్రయత్నించాలంటున్నారు. గంటా, రెండు గంటలపాటు గేమ్స్ ఆడుకోవటం అయితే ఫర్వాలేదుగానీ.. అదేపనిగా కూర్చుని ఆడే పిల్లల్ని మాత్రం నియంత్రించాల్సి ఉంటుందంటున్నారు.