పసి పిల్లలు సాయంకాలాల్లో నిద్రపోవచ్చా..?
* సాధ్యమైనంతవరకూ పసిపిల్లలను సాయంకాలాల్లో నిద్రపోనీయకుండా ఆడించటం మంచిది. కాస్త ఎదిగిన తరువాత పిల్లల వయసున్న ఇరుగుపొరుగు చిన్నారులతో కలిసి ఆడుకునేలా చేయాలి. పెద్ద పిల్లలను అయితే వారి స్నేహితులతో కలిసి ఆడుకోమని ప్రోత్సహించాలి. ఇలా చేయటంవల్ల వారికి తగిన శారీరక వ్యాయామం అందుతుంది. దాంతో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.* అంతేగాకుండా బాగా ఆటలాడటంవల్ల పిల్లలు త్వరగా అలసిపోతారు. దాంతో హాయిగా నిద్రపోతారు. లేకపోతే సరిగా నిద్రపట్టక పీడకలల బారిన పడి, నిద్రలో కలవరింతలకు భయపడి లేచి ఏడుపు అందుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా సాయంకాలాల్లో నిద్రపోయిన పిల్లలు త్వరలా నిద్ర మేలుకోవటం, తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించటం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.