Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్బంధ విద్యతో "యాంగ్జయిటీ హైపర్ వెంటిలేషన్"

Advertiesment
చైల్డ్ కేర్
FILE
* నిర్బంధ విద్య పిల్లల్ని శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా తీవ్రమైన ఒత్తిళ్లకు గురిచేస్తోంది. దానివల్ల వారు పలురకాల వ్యాధులకు గురవుతున్నారు. ఆందోళనకు గురైన సందర్భాలలో అత్యధిక స్థాయిలో గాలి పీల్చుకోవటం జరుగుతుంది. దీనినే యాంగ్జయిటీ హైపర్‌ వెంటిలేషన్‌ అని పిలుస్తారు.

* సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అత్యధిక స్థాయిలో గాలి పీల్చుకోవటం, గుండెలు బరువెక్కినట్లు ఉండటం, గుండెదడ, నిద్ర సరిగా పట్టకపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరి ఎక్కువగా తీసుకోవటంవల్ల రక్తంలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం తగ్గుతుంది. దీంతో రెస్పిరేటరీ అల్కలోసిస్ అనే సమస్య ఏర్పడుతుంది. దీంతో కాళ్లు, చేతులు కొంకర్లు తిరిగి "టెటనీ" అనే వ్యాధి బారిన పడవచ్చు.

* పిల్లల్లో వచ్చే యాంగ్జయిటీ హైపర్‌ వెంటిలేషన్‌ను తల్లిదండ్రులు తొలిదశలోనే గుర్తించి, పిల్లలకు ఆందోళన కలిగించే విషయాలపట్ల వారికి అవగాహన కలిగిస్తూ వారిలో భయాన్ని పారద్రోలాలి. పిల్లలు బాగా చదివి మొదటి ర్యాంకు తేవాలని, పక్కవారి పిల్లలకంటే చదువులో ముందుండాలని వారిపై వత్తిడి తేకుండా, స్థాయికి తగినట్లుగా ప్రోత్సహిస్తే బాగా చదవడం ప్రారంభిస్తారు. అదే విధంగా క్రీడలు, సంగీతం తదితర విషయాల్లో ప్రోత్సహించటం, మంచి పుస్తకాలు చదివే విధంగా ఉత్సాహపరచడం కూడా అవసరమే.

Share this Story:

Follow Webdunia telugu