చిన్నారుల్లో "కమ్యూనికేషన్ స్కిల్స్" పెరగాలంటే..?
* ఎప్పుడైతే అవతలి వారు చెప్పేది వింటూ, మనమూ మాట్లాడుతూ, అవతలి వారికి అవకాశం ఇస్తూ వస్తామో... అప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అలాంటప్పుడు పదిమందిలో ఏ విషయం గూర్చయినా ధైర్యంగా మాట్లాడటం అలవాటు అవుతుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చిన్నారులకు కూడా చాలా అవసరం.* పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలంటే.. పిల్లలకు, వారి స్నేహితులకు ఏదైనా ఒక విషయం గురించి చర్చ వచ్చినప్పుడు, సాధ్యమైనంత ఎక్కువగా దాని గురించి మాట్లాడుతూ.. చర్చను కొనసాగించమని చెప్పాలి. అయితే ఇలా మాట్లాడేటప్పుడు పిల్లల స్నేహితులు ఏం చెబుతున్నారో వింటూనే, చర్చను పొడిగించమని చెప్పాలి. ఎదుటివారు చెప్పేది వింటూనే, వారికి కూడా మాట్లాడే అవకాశాన్నివ్వాలని పిల్లలకు అర్థం చేయించాలి.* ఎదుటివారితో మాట్లాడటం, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వటం, వారు చెప్పేది వినటం లాంటివి చేయకపోతే... కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉండదనీ, తద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ అలవడని పిల్లలకు తెలియజెప్పాలి. ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నట్లయితే ఎంతమంది ఉన్నా సరే ఎలాంటి విషయంపైనైనా సరే ధైర్యంగా మాట్లాడటం అనేది అలవాటు అవుతుందని పిల్లలకు చెప్పాలి.