Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాన్సర్‌కు చిరునామాగా మారిన ప్లాస్టిక్ వినియోగం!!

Advertiesment
క్యాన్సర్
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2012 (15:46 IST)
File
FILE
ఆట వస్తువులను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. గతంలో ఇవి ఎక్కువగా చెక్క, కొయ్య, తాటాకు, కాగితపు బొమ్మలుగా వచ్చేవి. ఇపుడు వీటి స్థానంలో ప్లాస్టిక్ బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఆ ఆట వస్తువులు పిల్లల ప్రాణానికే పరిణమిస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ప్లాస్టిక్ వస్తువులతో ఆటలాడేటప్పుడు రోజుకు కనీసం మూడు గంటలు నోటిలో పెట్టుకుంటారని, ఇది క్యాన్సర్ వ్యాధికి కారణమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూర్వం పిల్లలకు కొయ్యతో చేసిన ఆటవస్తువులు, కాగితపు బొమ్మలు, తాటాకు బొమ్మలు, మట్టి బొమ్మలను కొని ఇచ్చేవారు. ప్రస్తుతం వీటి స్థానాన్ని వివిధ రకాల, ఆకర్షణీయమైన ప్లాస్టిక్ బొమ్మలు ఆక్రమించాయని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ బొమ్మలే దర్శనమిస్తున్నాయి.

ప్లాస్టిక్ బొమ్మలు తళతళ మెరిసేందుకు కారణం అందులో వేసే వివిధ రకాల రసాయన పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇలాంటి ఆట బొమ్మలను పిల్లలు ఆడుకునేటప్పుడు సర్వసాధారణంగా నోటిలో పెట్టుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల బొమ్మల్లోని రసాయన పదార్థాలు పిల్లల కడుపులోకి వెళ్లి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి.

ఈ బొమ్మల తయారీకి వాడే రసాయనాల్లో కొన్ని విషతుల్యం కలిగినవి కూడా ఉన్నాయి. ప్రధానంగా... బొమ్మల తయారీలో క్యాడ్మియం అనే రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఇది పిల్లల నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు చెపుతున్నారు. దీని మూలంగా పిల్లలు పెరుగుదల కూడా బాధిస్తుంది. ఇది ఎక్కువ మోతాదులో చేరినట్టయితే వివిధ రకాల వ్యాధులను కలిగిస్తోందని ఓ సర్వేలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu