Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరుబయట పిల్లలతో ఆడుకోండిలా..!!

Advertiesment
చైల్డ్ కేర్
FILE
* పిల్లలు పాఠశాలల నుంచి నేరుగా ఇంటికి చేరుకోగానే.. వారికింత టిఫిన్ ఇచ్చేసి, గబగబా ట్యూషన్లకు తరిమేస్తుంటారు తల్లిదండ్రులు. అలా వారిని పాఠశాల, ఆ తరువాత ట్యూషన్లు, ఆపైన హోంవర్క్ అంటూ ఓ బందిఖానాలో బంధించటం కాకుండా.. కాస్సేపు ఆరు బయటకో, పార్కులకో, స్నేహితుల ఇళ్లకో తీసుకెళ్లటం మంచిది.

* కుదిరితే ఒకరోజు పార్కుకు, మరో రోజు సైకిల్ ప్రాక్టీస్, ఇంకో రోజు స్నేహితుల ఇళ్లకి, ప్లే గ్రౌండ్‌లో టెన్నిస్, క్రికెట్ లాంటి ఆటలు పిల్లల చేత ఆడిస్తే, ఉదయం నుంచి వారు పడ్డ హైరానాను మరచిపోతారు. ఇలా చేయటం వల్ల పెద్దలకు పిల్లలతో గడిపే అవకాశమే గాకుండా, మంచి వ్యాయామం కూడా తోడవుతుంది.

* పిల్లలు కాసేపు తల్లిదండ్రులతో గడపటంవల్ల వారితో చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. అలాగే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆ తరువాత ట్యూషన్లకు పంపిస్తే అక్కడ చక్కగా చదువుకోగలుగుతారు. ఇంటికి వచ్చాక వాళ్ల హోంవర్క్‌ను ముగించి ఎంచక్కా హాయిగా నిద్రపోతారు.

Share this Story:

Follow Webdunia telugu