Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆత్మవిశ్వాసానికి "హార్ట్ వర్క్" తప్పనిసరి..

Advertiesment
చైల్డ్ కేర్
FILE
* పరీక్షలప్పుడు ఆత్మ విశ్వాసంతో ఉండాలంటే.. ప్రిపరేషన్‌కు మించిన పరిష్కారం లేదు. ఎలా చదివితే తాము అనుకున్న లక్ష్యానికి చేరుకోగలము అనుకుంటున్నారో, అలాగే చదవాలి. హార్డ్ వర్క్ కంటే హార్ట్ వర్క్ చాలా ముఖ్యం. చేస్తున్న ప్రతి పనినీ ఆనందిస్తూ, మనస్ఫూర్తిగా చేస్తే అలసటకు తావనేదే ఉండదు.

* పిల్లల్లో పరీక్షల సమయంలో ఎనర్జీ మేనేజ్‌మెంట్ కూడా చాలా ముఖ్యమే. ఇందుకోసం మంచి ఆహారం, సరిపడా నిద్ర, వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజూ మూడుసార్లు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రాత్రిపూట తక్కువ పరిమాణంగల ఆహారాన్ని తీసుకోవాలి.

* మీతోపాటు మీ స్నేహితులకు కూడా మంచి మార్కులు రావాలని కోరుకునే పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. దీనివల్ల ప్రశాంతత లభించి, చదివేది మనసుకు మరింతగా హత్తుకుంటుంది. దీంతో విషయాలను బాగా గుర్తు పెట్టుకోవచ్చు. అలా విషయాలు బాగా గుర్తుంటే, పరీక్షల్లో స్పష్టమైన సమాధానాలను రాసి మంచి మార్కులను సంపాదించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu