Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవి కాలం పిల్లల్ని గ్రామాలకు తీసుకెళ్తున్నారా? లేక ఏసీ రూముల్లోనే..?

Advertiesment
Positive Parenting Tips for Summer
, గురువారం, 7 మే 2015 (16:08 IST)
వేసవి కాలం.. అసలే ఎండలు భగ్గుమంటున్నాయి. పిల్లల్ని ఇంటికే పరిమితం చేసి.. ఏదో కొంత డబ్బు ఖర్చు చేసి ఏసీలు ఫిట్ చేసేస్తే.. వీడియో గేమో ఏదో ఆడుకుంటూ పిల్లలు ఇంట్లో ఉండిపోతారు కదా.. అని అనుకునే పారెంట్స్ మీరైతే.. తప్పకుండా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిందే. పెరిగే పిల్లలను ఇంటికే పరిమితం చేయడం వీడియో గేమ్స్‌తో సరిపెట్టడం వంటివి చేయకుండా వేసవికాలంలో పిల్లలతో ట్రిప్ వేయండి. 
 
ఏసీలకే అలవాటు చేయకుండా గ్రామాలకు తీసుకెళ్లండి. విలేజ్ వాతావరణానికి వారిని అలవాటు చేయండి. అప్పుడే పిల్లల్లోనూ కష్టపడే తత్త్వం పెరుగుతుంది. ఎలాంటి కష్టసుఖాలు, నష్టాలను తెలియకుండా పిల్లల్ని పెంచకూడదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అందుకే వేసవిలో సగం రోజులు గ్రామ వాతావరణంలో పిల్లల్ని ఉంచండి. రైతులు, పొలాలు ఎలా ఉంటాయని తెలియజేయండి. బియ్యం ఎలా వస్తుందని అడిగే ప్రస్తుత లేటెస్ట్ ట్రెండ్ పిల్లలకు రైతు పడే కష్టాలు గ్రామ ప్రజలు ఎలా ఉంటారనే వాతావరణాన్ని తెలుసుకోనివ్వండి. సంవత్సరమంతా చదువులు, ట్యూషన్లు, స్పెషల్ క్లాజ్‌లంటూ అలవాటుపడిపోయిన పిల్లల్ని గ్రామాల్లో ఆడుకోనివ్వండి. బంధువులను పిల్లలకు పరిచయం చేయండి. జాతర ఇతరత్రా శుభకార్యాల్లో పాల్గొనేలా చేయండి. 
 
గ్రామాలను చుట్టొచ్చాక.. ఏదైనా యాత్రకు వెళ్లండి. చల్లచల్లగా ఉండే ప్రాంతాలకు పిల్లల్ని తీసుకెళ్లండి. పురాతన స్థలాలకు తీసుకెళ్లండి.. ఇలా చేస్తే పిల్లలకు మంచి చెడు ఏంటో బాగా అర్థమవుతుంది. అప్పుడే సమాజంలోని మంచి చెడులను కూడా పిల్లలు ఎదిగేకొద్దీ సులభంగా అర్థం చేసుకోగలుగుతారని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu