పిల్లలకు వేళ్లు చప్పరించే అలవాటుంటే.. ఏం చేయాలో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. పిల్లలకు ఆ అలవాటు ఏర్పడటానికి కారణం ఒంటరితనంగా ఉన్నామనే ఆలోచనతో పాటు భయం వంటి కారణాలే అని వైద్యులు చెబుతున్నారు. అలాగే పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు కూడా చేతి వేళ్ళను చప్పరిస్తారు.
ఈ అలవాటున్న పిల్లలు ఆహారంపై శ్రద్ధ చూపరని, తద్వారా బరువు తగ్గిపోతారని వైద్యులు అంటున్నారు. అయితే ఈ అలవాటును మాన్పించడమే పిల్లలకు శ్రేయస్కరం. చేతివేళ్లను చప్పరించే అలవాటున్న పిల్లల్లో దంత సమస్యలు తప్పవు. దంతాల వరుస మారుతాయి. చేతివేళ్లను చప్పరించడం ద్వారా క్రిములు సులభంగా నోటి ద్వారా ఉదరానికి చేరుకుంటాయి. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తప్పవు.
అందుచేత చంటి పిల్లల నుంచి ఐదేళ్ల పిల్లల వరకు వేళ్ళు చప్పరిస్తే అలవాటును మాన్పించాలి. మానసికంగా వారిలో ఉండే భయాన్ని తొలగించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి. ఆకలి ఉండనీయకుండా చూసుకోవాలి. ఇతరుల ముందు డిస్కరేజ్ చేయకుండా వారిని ప్రోత్సహించాలి. ఇంకా వైద్యుల సలహాలను కూడా పాటించవచ్చు.