Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల్లో కడుపునొప్పిని నివారించాలంటే ఏం చేయాలి?

Advertiesment
How to Cure a Child's Stomach Ache
, గురువారం, 9 అక్టోబరు 2014 (17:35 IST)
పెద్దలే కడుపునొప్పిని తట్టుకోలేరు. అలాంటిది.. పసిపిల్లల్లో కడుపునొప్పి వచ్చేందుకు ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆహారపు అలవాట్లు వలనే మూత్రపిండాల్లో రాళ్ళు తయారవడం, ఇన్ఫెక్షన్లు ఏర్పడటం, నులిపురుగులు తయారవడం జరుగుతుంటాయి. 
 
కాబట్టి, పిల్లలకు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మంచి ఆహారం తీసుకోవడంలాంటివి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. పిల్లలకు కడుపు నొప్పి పదే పదే వస్తున్నా, రాత్రిళ్ళు వచ్చిన నొప్పి ఎక్కువ సేపు ఉన్నా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స ఇప్పించాలి.
 
కలుషిత ఆహారం తీసుకోవడం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, నులిపురుగులు తయారవడం, ఇన్ఫెక్షన్లు కలగడం వంటి కారణాలతో కడుపు నొప్పి వస్తుంది. 
 
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. 
భోజనానికి ముందు పిల్లల చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. 
చేతులకు గోళ్ళు లేకుండా చూసుకోవాలి.
 
టైఫాయిడ్, జాండిస్ నిరోధక వ్యాక్సిన్లను పిల్లలకు తప్పకుండా వేయించాలి.
1-5సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి 6నెలలకొకసారి డివార్మింగ్ మెడిసిన్ ఇవ్వాలి. 
నొప్పి నివారణకు మాత్రలను వాడటం తగ్గించాలి.
ఆహారం, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. మల, మూత్ర విసర్జన అనంతరం శుభ్రంగా చేతులు కడుక్కోవాలి
 
బాగా ఉడకబెట్టిన ఆహారంను మాత్రమే తీసుకోవాలి. 
కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. 
ప్రతి రోజూ 6-8గ్లాసుల నీరు తీసుకోవాలి. 
వేడి వేడి ఆహారాన్ని మాత్రమే భుజించాలి.

Share this Story:

Follow Webdunia telugu