Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రిపూట పిల్లలు నిద్రపోవాలంటే ఏం చేయాలి?

రాత్రిపూట పిల్లలు నిద్రపోవాలంటే ఏం చేయాలి?
, మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (17:21 IST)
రాత్రిపూట పిల్లలు నిద్రపోకపోతే ఇబ్బందిగానే ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవాలంటే.. రాత్రిపూట పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలంటే.. ముందుగా పిల్లలకు సమయపాలన నేర్పాలి. పిల్లలకు రాత్రిపూట ఫలాన సమయంలో నిద్రపోవాలనే భావనను అలవాటుగా మార్చాలి.
 
నిద్రకు సంబంధించిన అంశాలను పిల్లల మదిలో నిక్షిప్తం చేయగలిగితే అలవాటుపడతారు. రాత్రిపూట ఏడింటికి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించడం, స్నానానికి ముందు ఆడించడం.. స్నానం చేసే నీటిలో తేలే బొమ్మలను ఆడుకోనివ్వడం వంటివి చేయాలి.  
 
మంచి సుగంధ భరితమైన పౌడర్‌ను రాయడం, నిద్రకు ముందు మంచి కథను చెప్పడం, వీలైతే మంచి సంగీతాన్ని వినిపించడం. ఇవన్నీ పిల్లలు ఇష్టపడే అంశాలు. వీటిని రోజూ క్రమం తప్పకుండా ఆచరిస్తే కొన్ని రోజులకు పిల్లల్లో ఈ విధానం సహజనిద్రను ప్రేరేపిస్తుంది.
 
పాప నిద్రిస్తున్నప్పుడు మీరు కూడా తనతో పాటే అక్కడే ఉండాలని భావిస్తున్నట్లయితే పాప నిద్రపోయే వరకూ మీరు అక్కడే ఉండాలి. నిద్రకు ఉపక్రమించిన పావుగంట తరువాత దుప్పటి సవరించడం వంటివి చేయవచ్చు. 
 
ఒకవేళ పాప ఏడిస్తే చూడనట్లు ఉండాలి తప్పితే ఎక్కువ ఆతృత కనపరచకూడదు. పిల్లలు ఏడ్చినప్పుడు తల్లితండ్రులు అతిగా స్పందిస్తే, ఏడవడం ద్వారా దేనినైనా సాధించుకోవచ్చు ననే భావన పిల్లల్లో పెరిగిపోయి చీటికీమాటికీ ఏడుస్తారు.
 
అలాగే పై కప్పు మీద మెరిసే నక్షత్రాలను అతికించడం, గోడల మీద ఆసక్తి కలిగించే పోస్టర్లను అతికించడం వంటివి చేస్తే పిల్లలు వాటిని చూస్తూ నిద్రలోకి జారుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu