స్కూలుకెళ్లే పిల్లలున్నారా...? బస్తాల్లాంటి బ్యాగులు మోయాల్సిందే... కానీ మీరు కూడా...
“పలక, పుస్తకాలు మోసుకొని వెళ్తున్న బాబులు.... మీరు శిలువలు మోస్తున్న క్రీస్తుల్లా ఉన్నారు” అని గుంటూరు శేషేంద్ర శర్మ అన్నట్లుగా ప్రస్తుత ప్రైవేటు- కార్పొరేటు పాఠశాలలు కేజీల కొద్దీ బ్యాగులను పిల్లలచేత మోయిస్తున్నాయి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు బడికి
“పలక, పుస్తకాలు మోసుకొని వెళ్తున్న బాబులు.... మీరు శిలువలు మోస్తున్న క్రీస్తుల్లా ఉన్నారు” అని గుంటూరు శేషేంద్ర శర్మ అన్నట్లుగా ప్రస్తుత ప్రైవేటు- కార్పొరేటు పాఠశాలలు కేజీల కొద్దీ బ్యాగులను పిల్లలచేత మోయిస్తున్నాయి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు బడికి వెళ్ళే పిల్లలు బరువులు మోసే కూలీల కంటే ఘోరంగా మారిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలలు తమ ఆడంబరాన్ని ప్రదర్శించడానికి పిల్లలను బలిచేస్తున్నాయి.
వేల రూపాయిల పుస్తకాలను అవసరానికి మించి అంటగడుతూ డబ్బును దండుకుంటున్నాయి. దీంతో కేజీలకు కేజీలు పుస్తకాలను కుక్కిన బ్యాగులను ఎత్తలేక మోసుకొంటూ బడిబాట పడుతున్నారు. ఈ పరిస్థితి విద్యార్థులకు శారీరక భారాన్ని, తల్లిదండ్రులను ఆర్థిక భారానికి గురిచేస్తున్నాయి. ఈ పుస్తకాలతో పాఠశాల మెట్లు ఎక్కి దిగాలంటే ఈ చిన్నారుల బాధ వర్ణనాతీమనే చెప్పాలి.
చిన్న వయస్సులో అధిక పుస్తకాల రూపంలో వారిపై పెద్ద బరువులు పడుతుంటే , దేశానికి దిక్సూచిల్లా నిలవాల్సిన చిన్నారులు వెన్ను సమస్య, భుజాల నొప్పితో బాధపడుతున్నారు. బడికి వెళ్ళే పిల్లల శరీర బరువులో బ్యాగ్ బరువు పది శాతానికి మించకూడదు. అంతకంటే బరువు ఎక్కువగా ఉంటే ఎముకలు, వెన్నుపూసకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు.
18 ఏళ్ళ వరకు శరీరంలో ఎముకలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ వయసు లోపు ఎక్కువ బరువు మోస్తే అది పిల్లల భవిష్యత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. బ్యాగుల బరువే కాదు వాటిని వేసుకునే విధానం వల్ల కూడా పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పుస్తకాల బ్యాగ్ బరువు అధికంగా ఉంటే పిల్లలకు మెడ, వెన్ను, భుజం నెప్పులు వేధిస్తాయి. వెన్నెముకను వంకరగా మార్చే స్కోలియోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. భుజానికి ఒకవైపు బ్యాగు తగిలించుకోవడం ఏమాత్రం మంచిదికాదు. బరువు బ్యాగులు వేసుకొని వంగి నడవడం వల్ల భవిష్యత్తులో వీరు గూని బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.
అందువల్ల తల్లిదండ్రులు పిల్లలు బ్యాగుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చిన్న పుల్తకాలను బ్యాగ్ ముందు వరుసలో పెట్టుకోవాలి. గట్టిగా ఉండే పుస్తకాలను వీపుకు తగిలేలా అమర్చుకోవాలి. బ్యాగ్ తగిలించుకున్నాక నిటారుగా నడవాలి. బ్యాగులో రెండు వైపులా పుస్తకాలు సమానంగా ఉండేలా పెట్టుకోవాలి. పుస్తకాల బ్యాగ్ వేసుకొని వంగి నడవరాదు. ఇదే పరిస్థితి కొనసాగితే చదువుల సంగంతి దేవుడెరుగు పిల్లలు అనారోగ్యపాలవుతారు. ఆ పరిస్థితి మారాలి. విద్యాశాఖ పుస్తకాల విషయంలో కొన్ని నియమ నిబంధనలను గట్టిగా అమలు పర్చాలి. మీడియా కూడా ఈ విషయంలో ప్రజలను చైతన్యపర్చాలి. ఈ వైఖరిపై మేథావులు నిరసన గళం విప్పాలి. ప్రభుత్వాలు ప్రైవేటు విద్యాసంస్థల నియమాల పై కొరడా ఝళిపించాలి. భావి భారత పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది.