Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లల పెంకితనానికి బ్రేక్ వేయాలంటే..? ఇలా చేయండి?

పిల్లల పెంకితనానికి బ్రేక్ వేయాలంటే..? ఇలా చేయండి?
, శనివారం, 20 సెప్టెంబరు 2014 (18:01 IST)
పిల్లల్లో పెంకితనం, మొండితనం చాలా డేంజర్. వాళ్లు కోరుకున్నది ఇవ్వకపోతే.. పెంకితనాన్నే పిల్లలు ఆయుధంగా ఎంచుకుంటారు. కోరుకున్నది పొందకపోతే, వారి చిరాకు, నిరాశను గట్టిగా అరవటం లేదా ఏడవటం ద్వారా చూపిస్తారు.
 
చిన్నపిల్లలు పెంకితనంతో వ్యవహరిస్తున్నట్లయితే మనం కొన్ని భావోద్వేగాలను అణచివేసుకోవాలి. ఇటువంటి సమయాల్లో మన భావాలను బయట పెట్టకూడదు. ఇటువంటి చిన్నపిల్లలను నిర్వహించడానికి 3 సమర్థవంతమైన మార్గాలు ఉన్నాయి.
 
పెంకితనంతో వ్యవహరించే పిల్లలను నిర్వహించే తల్లిదండ్రులకు రక్తపోటు, ఒత్తిడి స్థాయిలు పెరుగుతుంటాయి. నిశ్శబ్దంగా ఉండండి.. కొన్ని క్షణాలు బిడ్డకు దగ్గరగా ఉండండి. ఇలా చేయటం వలన పిల్లల్లో పెంకితనం తగ్గుతుంది.
 
చిన్న పిల్లలు ఎందువల్ల ఇలా ప్రవర్తిస్తున్నారో, కారణమేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. కారణమేమిటో తెలుసుకొని స్పందించండి. బిడ్డ ఆకలితో ఉన్నాడా నిద్రపోవాలనుకుంటున్నాడా.. తెలుసుకొని తన అవసరాలను తీర్చండి. బిడ్డ, తనను  నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తే, అతనితో కొంత సమయం గడపండి.
 
పిల్లల్లు అనుకున్నది పొందడానికి ఈ పెంకితన మార్గం వారికి బాగున్నది అనుకుంటే, వారు ఎప్పుడు అదే మార్గం అవలంబిస్తారు. వారిని ఇదే మార్గంలో ప్రోత్సహిస్తుంటే వారు ఇంకా మొండివైఖరిని నేర్చుకుంటారు. ప్రారంభంలోనే ఈ పెంకితనాన్ని అదుపులో ఉంచగలగాలి.
 
కొంతమంది చిన్నపిల్లలు తాము అనుకున్నది సాధించటానికి చేసే పెంకితనం చాలా నాటకీయంగా ఉంటుంది. ఈ సందర్భంలో, వారి నుండి అన్ని ప్రమాదకరమైన వస్తువులను దూరంగా ఉంచండి. పిల్లలు పెంకితనం చేస్తున్నప్పుడు వారిని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ మాట్లాడండి.

Share this Story:

Follow Webdunia telugu