Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసిబిడ్డకు సీజన్‌కు తగ్గట్టు దుస్తులు వేయండి.. పూర్తిగా కప్పేస్తే..?

Advertiesment
Child Care tips
, గురువారం, 25 జూన్ 2015 (18:49 IST)
తొలిసారిగా తల్లి అయినప్పుడు శిశువు సంరక్షణపై శ్రద్ధ పెట్టాలి. భయం, ఆందోళనను పక్కనబెట్టి.. ఆనందంతో ముందుకెళ్లాలి. బిడ్డని ఎలా చూసుకోవాలి. ఎలా పెంచాలి అనే రకరకాల ఆలోచనలను పక్కన బెట్టేస్తే టెన్షన్ తగ్గిపోతుంది. డాక్టర్ల సలహా ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటూ శిశువును చూసుకోవడం సులభమవుతుంది. తొలి రోజుల్లో శిశువును జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. 
 
కొత్తలో బిడ్డ ఏడిస్తే ఏదైనా నొప్పి వస్తుందేమోనని భయపడతారు. కానీ ప్రతీసారీ ఏడుపు వెనుక కారణం నొప్పే కానక్కర్లేదు. నిద్ర చాలకపోవడం, ఆకలి వంటి చాలా కారణాలు ఉండవచ్చు. బట్టలు మార్చడం.. ఒళ్లు తుడవటం, పాలు పట్టించి నిద్రపుచ్చేందుకు ప్రయత్నించండి. అప్పటికీ ఊరుకోకపోతే డాక్టర్ని సంప్రదించండి. 
 
సీజన్‌ను బట్టి దుస్తులు వేయాలి. పసి బిడ్డ కదా అని వేడిమిలో కూడా ఒళ్లు పూర్తిగా కప్పేస్తే వారికి చిరాకు పుడుతుంది. కాబట్టి పల్చటి, కాటన్ జుబ్జాలు వేయండి. చలిగా వుంటే మాత్రం వెచ్చని ఉన్ని దుస్తులు వాడండి. గ్లౌజులు, సాక్స్ తప్పకుండా కప్పివుంచండి. ఏది వేసినా.. ఆ క్లాత్ వల్ల బిడ్డకు ర్యాష్ గానీ వస్తుందేమో గమనించుకోండి.

Share this Story:

Follow Webdunia telugu