Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాప బొద్దుగా ఉంటే స్థూలకాయం ఉన్నట్లేనా?

Advertiesment
Child care tips
, శుక్రవారం, 15 మే 2015 (16:55 IST)
పిల్లలు బొద్దుగా వుంటే ముద్దుగానే వుంటారు కాని, బొద్దుతనం స్థూలకాయం అవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. పోషకాలందించని చిరుతిండ్లవల్ల బరువు పెరుగుతారు. పిల్లల ఆహారం విషయంలో పెద్దలే రోల్ మోడల్స్ కావాలి. సమతులాహారం తినడం, వ్యాయామం, స్విమ్మింగ్, సైకిలింగ్, వాకింగ్, రన్నింగ్, డ్యాన్సింగ్, స్కేటింగ్ వంటి వాటిని ప్రోత్సహించాలి. ఫ్రిజ్‌లో హెల్దీ ఫుడ్ వుంచాలి. 
 
టీవీ, కంప్యూటర్ల ముందు కూర్చుని ఆహారాన్ని తిననివ్వకూడదు. ఆహార నిపుణుల సలహాలేకుండా పిల్లలకు డైటింగ్ నియంత్రణలు విధించకూడదు. బరువు తగ్గాలన్న ఏకైక సూత్రం మీద దృష్టి నిలపకుండా ఆరోగ్యవంతమైన జీవన విధానాల్ని నేర్పించాలి. ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యవంతమైన జీవన విధానాల్ని నేర్పించాలి. ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మాత్రమే అలవాటు చేయాలి. 
 
చాక్లెట్లు, బంగాళాదుంపల చిప్స్, ఐస్ క్రీమ్‌లు, క్యాండీలు, కేక్స్, డ్రింక్స్ వంటివి ఇంట్లోవుంచి పిల్లల్ని నియంత్రించాలంటే సాధ్యపడదు. ఆకలిగా లేనప్పుడు ఆహారం తినమని వారిని బలవంతపెట్టకూడదు. వారేదైనా పని ముగించడానికి ఆహారాన్ని లంచంగా చూపవద్దని న్యూట్రీషన్లు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu