Publish Date: Wed, 19 Nov 2014 (15:14 IST)
Updated Date: Wed, 19 Nov 2014 (15:20 IST)
తల్లిదండ్రులు అతిగా పిల్లల విషయంలో జోక్యం చేసుకోకూడదని మానసిక నిపుణులు అంటున్నారు. పిల్లల అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వండి. వారి ఇష్టాలను గౌరవించండి. ఎగతాళి చేయకండి. సహాయంగా ఉండండి.
పిల్లలకి మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలనో, ఇంజినీర్ అవ్వాలనో ఆశ వుంటే సహాయపడండి. మీ ఆలోచనలను వారిపై రుద్దకండి. పిల్లల జీవితంలో.. వారి జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు వారికీ తీసుకునే స్వేచ్చ ఉంది.
తల్లిదండ్రుల ఆలోచనలకి పిల్లల ఆలోచనలకి భేదం ఉన్నా సర్దుకుపొండి. ఆవేశపడకండి. పిల్లల స్నేహితులని చూసి ఎగతాళి చేయకండి. అమ్మాయిల డ్రస్సింగ్ విధానం, బ్యూటీ విధానాలపై షరతులు పెట్టకండి.
పిల్లలు చేసేవి కొన్ని తల్లిదండ్రులు చేయకపోవచ్చు. ఇది వారి జీవితం. మీ జీవితం కాదు. చదువు, ఆహారం, పాకెట్ మనీ వంటి ముఖ్య విషయాలలో మీ ప్రభావం ఎలాగో వారిపైన ఉంది. అతిగా వారి విషయాలలో జోక్యం చేసుకోకండని మానసిక నిపుణులు అంటున్నారు.