Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలను తోబుట్టువులతో పోల్చకండి.. మొండికేస్తారట!

పిల్లలను తోబుట్టువులతో పోల్చకండి.. మొండికేస్తారట!
, శుక్రవారం, 17 అక్టోబరు 2014 (16:42 IST)
పిల్లలను తోబుట్టువులతో పోల్చే తల్లిదండ్రులు మీరైతే జాగ్రత్త పడండి. తోబుట్టువులతో పోల్చడం చేస్తే మొండి ఎక్కువైపోతుందని చైల్డ్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
కొందరు పిల్లలు ప్రతి దానికి మారాం చేస్తుంటారు. అది కావాలి, ఇది కావాలి అంటూ తోబుట్టువులతో గొడవలు పెట్టుకుంటారు. పిల్లల్లో ఈ తరహా వైఖరి దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. అలా కాకుండా, పిల్లల్లో ఆరోగ్యకరమైన అనుబంధం పెంపొందించేందుకు 6 మార్గాలున్నాయి.. అవేంటో చూద్దాం..!
 
1. రెండో సంతానం గర్భంలో ఉండగానే, తొలి సంతానాన్ని ఈ విషయమై సన్నద్ధం చేయాలి. కుటుంబంలో కొత్తగా రాబోయే వ్యక్తితో మున్ముందు ఎలా మెలగాలో విడమరిచి చెప్పాలి. 
 
2. ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు? అన్న విషయాన్ని పిల్లలకు స్పష్టంగా తెలియజెప్పాలి. గొడవపడుతున్న పిల్లలను కూర్చోబెట్టి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. బాహాబాహీ తలపడడం చేయకూడదని చెప్పాలి. 
 
3. ముఖ్యంగా పిల్లలను ఒకరితో మరొకరిని పోల్చకూడదు. పెద్దబ్బాయి ఏదైనా తప్పు చేస్తే వారి తోబుట్టువులతో పోల్చడం సరికాదు. అది వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
 
4. స్పర్థ ఒక్కోసారి అసూయగా పరిణమిస్తుంది. చిన్నవారిని బాగా చూస్తున్నారని, తమను బాగా చూడడంలేదని కొన్నేసి సార్లు పెద్ద పిల్లలు భావిస్తుంటారు. అలాంటి భావనలు పిల్లల్లో కలగనీయకుండా వారిని సమానంగా చూడాలి. 
 
5. ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో నిర్దేశించి, ఆ సమయంలో వారా పని చేసేట్టు చూడాలి. చిన్ననాటి నుంచే ఒకరితో ఒకరు వస్తువులను షేర్ చేసుకోవడాన్ని ప్రోత్సహించాలి. 
 
6. పిల్లలు గొడవ పడుతున్నారు కదా అని ప్రతిసారి జోక్యం చేసుకోవడం సరికాదు. పరిస్థితి చేయి దాటి పోతుందనుకున్న స్థితిలోనే మనం జోక్యం చేసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu