Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిజీ అనే పిశాచితో రోజూ ఫైట్: గోరుముద్దలు తినిపించే తల్లులే కరువు!

Advertiesment
Child care: Busy word is devil in child life
, మంగళవారం, 14 అక్టోబరు 2014 (15:35 IST)
ఆధునిక పోకడల కారణంగా బిజీ అనే పదం ప్రేమకు వ్యతిరేకంగా మారిపోయింది. ఫోన్లు, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వాటితో ప్రేమ అనే మాట ఎక్కడా కనబడకుండా పోతోంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే మిగిలిపోతున్న తరుణంలో.. పిల్లల పెంపకం కూడా బిజీ లైఫ్‌కు ముడిపడిపోయింది. 
 
ప్రస్తుతం ఫ్యాషన్, ఆధునిక ట్రెండ్‌తో పిల్లలకు అల్లారుముద్దుగా గోరు ముద్దలు తినిపించే తల్లులు కరువయ్యారు. బిజీ అనే పదంతో చిన్నారులు అమ్మ కోసం రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
తెల్లవారున ఏదో హడావుడిలో ఇంట్లో పనులు చేసేసుకుని.. పరిగెత్తుకునే వర్కింగ్ ఉమెన్.. ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంటే పిల్లలు తల్లిదండ్రుల వద్ద నేర్చుకునే దానికంటే.. ప్రతి చిన్న విషయాన్ని పాఠశాలల్లో టీచర్స్ వద్దే నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే బిజీ పిశాచి తాండవం ఆడితే భవిష్యత్తులో పిల్లలు కూడా టెస్ట్ ట్యూబ్‌లకే పరిమితమయ్యే దారుణం కూడా రాకతప్పదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
టైమ్‌ను మేనేజ్ చేయడం తెలియని వారికే బిజీ అనే పదం వర్తిస్తుంది. బిజీ అనే పదం విషం లాంటింది. ఈ పదాన్ని జయించిన వారే ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా స్వర్గంగా మార్చుకోగలుగుతారు. ఎప్పుడూ బిజీ అనే పిశాచితో పోట్లాడే నేటి ట్రెండ్ తల్లిదండ్రులు.. చిన్నారులతో గడిపే సమయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. 
 
పిల్లలతో గడపటాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. వారికి కావలసిన అవసరాలను తీర్చేందుకు పరిగెత్తి డబ్బు సంపాందించే తల్లిదండ్రులు వారితో కలిసిపోయేందుకు మాత్రం సమయం లేదని ఈజీగా చెప్తున్నారు.  
 
సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలకు పిల్లలతో గడిపేందుకు సమయం ఉండదు. ఇంటికొచ్చినా పనుల్లో మునిగిపోయే మహిళలు ఆపై పిల్లల ఆలనాపాలనా చూసుకోవట్లేదు. తద్వారా క్రీచ్, కేజీ స్కూల్స్‌లో చిన్న వయస్సులోనే పిల్లల్ని చేర్పిస్తున్నారు. ఇలా చిరు ప్రాయంలోనే అమ్మ ఒడికి దూరమయ్యే పిల్లల్లో మొండితనం అధికమైపోతుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
అందుచేత తల్లిదండ్రులు ఉద్యోగస్తులైనప్పటికీ మార్నింగ్, ఈవెనింగ్ పిల్లలలో గడిపేందుకు సమయం కేటాయించాలని.. ఇంటి పనులకే మహిళలు.. ల్యాప్‌టాప్‌లకే పురుషులు అతుక్కపోకుండా.. పిల్లల పెరుగుదలతో పాటు వారి మానసిక వికాసానికి అనువుగా.. సమయ పాలనను పాటించాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu