Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పారెటింగ్ టిప్స్ : పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు?

Advertiesment
8 Ways To Get Your Child To Speak
, బుధవారం, 4 ఫిబ్రవరి 2015 (18:01 IST)
నలుగురితో కాదు.. పిల్లలతో మాట్లాడటం కూడా ఓ కళే. చాలామంది తల్లిదండ్రులు దీన్ని తేలిగ్గా తీసకుంటారు. కానీ.. దానికీ కొన్ని మెలకువలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.. 
 
రోజంతా పిల్లలతో మాట్లాడాలని లేదు. వాళ్లు ఎక్కువగా మాట్లాడే సమయం గుర్తించండి. ఉదాహరణకు రాత్రిళ్లు పడుకునేటప్పుడూ, భోజనం చేసే సమయంలో, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడూ వాళ్లతో చక్కగా మాట్లాడండి. 
 
ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తూ మీరే సంభాషణను మొదలు పెట్టండి. దానివల్ల వాళ్ల గురించి మీరు పట్టించుకుంటున్నారనే సంకేతాన్ని అందించిన వారవుతారు. స్కూలు, చదువులూ, స్నేహితులూ.. ఇలా అడగకముందే తమ గురించిన అన్ని విషయాలు చెప్పడం మొదలెడతారు. 
 
* పిల్లలతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నప్పుడు మీరు దాన్ని ప్రశ్న రూపంలో అడగకూడదు అంటారు చైల్డ్ కేర్ నిపుణులు. మీ సందేహాల్ని వాళ్లకు అర్థమయ్యేలా వివరించండి. ఉపన్యాసంలా చెప్పడం, విమర్శించడం, భయపెట్టడం, బాధపడేలా తిట్టడం లాంటివి చేయకూడదు. పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు ఏ పనిచేస్తున్నా కొన్ని క్షణాలు ఆపి ఆసక్తిగా వినండి. తర్వాత మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. 
 
* మీరే విధంగా చెబితే వాళ్లు వింటున్నారో గమనించి అదే స్వరంతో చెప్పడానికి ప్రయత్నించండి. అంతేతప్ప కోపంగానో, గట్టిగా అరిచో చెబితో వాళ్లు పట్టించుకోకపోవచ్చు చాలాసార్లు మన అభిప్రాయాలూ చెబుతుంటే పిల్లలు పెద్దగా పట్టించుకోరు. ఆ పరిస్థితిని అధిగమించాలంటే వాళ్ల అభిప్రాయాల్ని తక్కువ చేస్తున్నట్లు కాకుండా మీరేం అనుకుంటున్నారని తెలియజేయండి.
 
సాధ్యమైనంతవరకూ వాదించే ధోరణిని తగ్గించండి. చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రుల్నే అనుకరిస్తారు. అది కోపం కావచ్చు. సమస్యల్ని పరిష్కరించడం కావచ్చు. సహనంతో మాట్లాడటం కావచ్చు. కాబట్టి ఏది మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు మీ పిల్లల విషయంలో అంతే ఆదర్శంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

Share this Story:

Follow Webdunia telugu