పిల్లలకోసం స్కూలుకు పంపే లంచ్, స్నాక్ బాక్సుల్ని వారికి నచ్చే విధంగా పంపడం దాదాపు ప్రతి తల్లికీ ఒకింత ఇబ్బందే. విభిన్నంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పుడు వారు పెట్టిన ఆహారాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చే వీలుండదు.
స్నాక్ బాక్స్ ఆకర్షణీయంగా, అంతగా బరువు లేకుండా ఉండాలి. బాక్సులో రెండుమూడు అరలుంటే ఒకటికంటే ఎక్కువ రకాలు సర్దిపెట్టడానికి సుళువుగా ఉండాలి. ఆయిలీగా ఉండేవి, వేపుడు పదార్థాలు పెట్టకపోవడం మంచిది.
మైదాపిండితో తయారుచేసిన పదార్థాలు కాకుండా, బ్రౌన్ బ్రెడ్ ప్రత్యామ్నాయం చేయాలి. ముప్పై రోజులకోసం ముప్పై రకాలు పెట్టాలన్న ఆలోచన అవసరం లేదు. పెట్టే స్నాక్స్ పిల్లలకు పోషకాలందించేదిగా, వారు ఇష్టపడేదిగా ఉండాలి.
స్కూలులో పిల్లలకు టిఫిన్ బ్రేక్ పదీపదిహేను నిమిషాలకు మించి ఉండదు. కాబట్టి, ఆ సమయంలో సుళువుగా తినడానికి వీలున్న చిరుతిండ్లు మాత్రమే ఇవ్వాలి.