పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీతో మీరేం చేస్తారు పిల్లలూ...
* అమ్మానాన్నలు పాకెట్ మనీగా ఇచ్చే డబ్బులను పిల్లలు వారికి నచ్చినట్లుగా ఖర్చుపెడుతుండటం సహజం. అయితే ఆ పాకెట్ మనీలోంచే కొంత డబ్బును దాచి ఉంచి, దాంతో ఒక నిరుపేద విద్యార్థికి పుస్తకాలు కొనిస్తే అందులో ఉండే ఆత్మ సంతృప్తి ఇంతా అంతా కాదు. అందుకే ఆపదలో ఉన్నవారికి, అవసరం అయినవారికి చేతనయినంత సహాయం చేయటం అనే గుణాన్ని చిన్నతనం నుంచే అలవర్చుకోవాలి.* అలాగే చిన్నతనం నుంచి స్నేహపూర్వక ప్రవర్తన. నొప్పించని మాటతీరు, అన్నింటికీ మించిన నిజాయితీ అనేవి కలిగి ఉంటే ఎవరినైనా సరే చిన్నవయసులోనే పెద్ద పెద్ద గౌరవాలు పొందేలా చేస్తాయి. ఎదుటివారు ఏదైనా ఒక విషయం గురించి చెబుతున్నప్పుడు, అది మనకు తెలిసిన విషయమైనా సరే నిర్లక్ష్యం చేయకుండా వినడంవల్ల.. ఎదుటివారి అభిప్రాయాలకు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. దీంతో చిన్నవయసు నుంచే గొప్ప వ్యక్తిత్వం కలిగిన చిన్నారులుగా ఉన్నతంగా ఎదుగుతారు.