Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల స్టడీ రూం ఎలా ఉండాలంటే...!

Advertiesment
బాల ప్రపంచం చైల్డ్ కేర్ తల్లిదండ్రులు పిల్లల చదువు స్టడీ రూం ఏకాగ్రత వాస్తు వినాయకుడు సరస్వతి దేవి క్యాలెండరు

Gulzar Ghouse

సహజంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని తాప్రయపడుతుంటారు. పునాదులు బాగుంటే కట్టడం బాగుంటుంది అన్న చందాన పిల్లలకు మంచి చదువు చెప్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది. మనస్పూర్తిగా ఏదైనా పని ప్రారంభిస్తే అందులో విజయం తథ్యమంటున్నారు పెద్దలు.

అలాగే పిల్లలకు చెందిన స్టడీ రూంను వాస్తు ప్రకారం నిర్మిస్తే, అది పిల్లల చదువులో ఏకాగ్రత కుదురి, పరీక్షలలో విజయం సాధిస్తారంటున్నారు వాస్తు నిపుణులు. వాస్తువలన కలిగే లాభాలు వాటితోబాటు వాస్తు సిద్ధాంతాలు మీ కోసం:

పిల్లల స్టడీ రూం ఎలా ఉండాలి..?

** పిల్లల స్టడీ రూం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి.

** ఈ గదిలో వినాయకుడు మరియు సరస్వతి దేవికి చెందిన బొమ్మలు లేదా క్యాలెండరు ఉండేలా చూసుకోవాలి.

** ఒకవేళ పిల్లలకు టేబుల్ ల్యాంప్ ఏర్పాటు చేస్తే ఆ ల్యాంప్‌ను ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేయండి.

** స్టడీరూం గదులను తేలికపాటి రంగులతో అలంకరించండి. లేత నారింజ రంగుతో తీర్చిదిద్దితే మరీ మంచిది.

** చదువుకు సంబంధించిన పుస్తకాలను దక్షిణం, పశ్చిమం లేదా ఆగ్నేయ దిశలో ఉంచండి.

** రీడింగ్ టేబుల్‌ను గోడకు ఆనించకండి. గోడకు టేబుల్‌కు మధ్య కనీసం 3 అడుగులుండేలా చూడండి.

** టేబుల్‌పై చాలా పుస్తకాలుంచకండి. వీటితో ఏ పుస్తకం తీసి చదవాలా..! అనే సందేహం వారిలో తలెత్తుతుంది.

** మీరు పడుకున్నప్పుడు మీ తల దక్షిణ దిక్కు వైపుండేలా చూసుకోండి.

** స్టడీరూంలో పెండ్యూలమ్‌తో కూడుకున్న గడియారం తప్పనిసరి అని వాస్తు నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu