పిల్లలు తరచూ ఆటలాడుకునేటప్పుడు వారి ముక్కుకి గాయాలు తగిలి రక్తం కారడం సహజంగా జరిగే క్రియ. అలాగే కొన్ని రకాల జ్వరాలలో ముక్కు ద్వారా రక్తం కారుతుంటుంది.
పిల్లలు వారి ముక్కుల్లో తెలియకుండా పుల్లలు, గింజలు దూర్చుకుంటేకూడా రక్తం కారుతుంటుంది. అలాగే వారిలో ఎడినాయిడ్స్ వాచిన పిల్లల్లోకూడా ముక్కు వెంట రక్తం కారుతుంది.
అలాగే ముక్కువెంట రక్తం కారడానికి డిఫ్తీరియా వ్యాధికూడా కారణమే అంటున్నారు వైద్యులు. ఇలాంటి సందర్భంలో ఎట్టి పరిస్థితులలోనూ ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించి వైద్యుల సలహామేరకు పిల్లలకు చికిత్సను అందించాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.