పిల్లల ఎదుగుదలకు దోహదం చేసేవి ప్రధానంగా గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్‌లు. ఈ గ్రోత్ హార్మోన్లను మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంథి స్రవిస్తుంది. థైరాయిడ్ హార్మోన్లను(టీ3,టీ4) గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథి స్రవిస్తుంది.
ఈ థైరాయిడ్ హార్మోన్లు లోపిస్తే పిల్లల ఎదుగుదల సరిగా లేనప్పుడు తప్పని సరిగా థైరాయిడ్ పరీక్ష చేయించి లోపం ఉందేమో చూడాలి. ఈ సమస్యను వెంటనే గుర్తించి సరైన చికిత్స చేస్తే వెంటనే పిల్లల ఎదుగుదల పుంజుకుని వాళ్ళు చక్కగా ఎదుగుతారంటున్నారు వైద్యులు.