పిల్లల్ని ఎండలో పడుకోబెట్టి మాలిష్ చేస్తే మంచిదా..?
* చిన్నపిల్లలను ఎండలో పడుకోబెట్టి మాలిష్ చేస్తే మంచిదేనని పిల్లల నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటంవల్ల సూర్య కిరణాల ద్వారా పిల్లల శరీరానికి అవసరమయ్యే "విటమిన్ డి" చక్కగా అందుతుందని అంటున్నారు. పిల్లలకు మాలిష్ చేసేందుకు ఆవు నెయ్యి లేదా వెన్నను ఎంచుకోవటం మంచిది. ఒకవేళ అవి దొరకకపోతే వంటనూనె, కొబ్బరి నూనెలను వాడవచ్చు.* పిల్లలకు మాలిష్ చేసేటప్పుడు మృదువుగా, సున్నితంగా, నిదానంగా, జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా జాయింట్లవద్ద సుతిమెత్తగా మాలిష్ చేయాలి. మాలిష్ అనంతరం పిల్లలచేత చిన్న చిన్న వ్యాయామాలు చేయిస్తే, వారి ఎముకలు పటిష్టంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.* కొంతమంది చిన్నారులు శారీరక మార్పులతోనో, శరీరంలో పెరగని వివిధ భాగాల కారణంగానో లేదా ఏదైనా జబ్బువల్లనో చాలామంది పిల్లలు బలహీనంగా ఉంటారు. అలాంటి వారికి కాడ్ లివర్ నూనెతో శరీరమంతటా మాలిష్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కాడ్ లివర్ నూనె దొరకకపోతే బాదం నూనెతో చేసినా మంచిదేనంటున్నారు.