Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలు వారికేం తెలుసంటూ.. నిర్లక్ష్యం చేస్తారా..?

Advertiesment
చైల్డ్ కేర్
FILE
* చిన్నారుల్ని పిల్లలు వారికేం తెలుస్తుందంటూ పెద్దలు నిర్లక్ష్యం చేస్తుంటారు. అయినా పిల్లలు ఒక్కోసారి సమస్యలను వారంతట వారే పరిష్కరించుకుంటారు. ఉదాహరణకు ఓ చిన్నారికి సైకిల్ కొనిస్తే.. ముందుగా ట్రయల్స్ వేస్తాడు. పడుతూ, లేస్తూ సైకిల్ నడపటం నేర్చుకుంటాడు. అయ్యో దెబ్బలు తగుల్తాయోమో అనుకుంటూ సైకిల్‌ను ఆ చిన్నారికి దూరం చేయకూడదు.

* అలాగే చిన్న వయస్సునుంటే కత్తులు, పిస్తోళ్లలాంటి బొమ్మలు ఇచ్చినట్లయితే.. పెద్దయ్యాక వారు ఏ రౌడీ రంగడిలాగో, కత్తుల రంగయ్యలా మారితే ఆశ్చర్యపోనక్కర లేదు. కాబట్టి.. అలాంటి బొమ్మలు సాధ్యమైనంతవరకు కొనివ్వకపోవటం మంచిది. అలాగే పిల్లలు మంచిపని చేసినప్పుడు పొగడాలేకానీ, ప్రతిదానికీ పొగుడుతూ ఉండకూడదు.

* చిన్నారుల ఊహలకు అడ్డుకట్ట వేయలేం. ఎదిగే పిల్లలకు ఆటలలో ప్రావీణ్యత చూపేందుకు అవకాశాలను కల్పించాలేగానీ, కేవలం ఇంటికే పరిమితం చేయకూడదు. పిల్లలకు సుఖసంతోషాలు అందించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి. వారి ఆశలు స్పోర్ట్స్ షాపులోని ఆటవస్తువులన్నింటిపైనా, ఐస్‌క్రీమ్ పార్లర్‌లో ఐస్‌క్రీముల తినాలని ఉంటాయి. అందుకే అప్పుడప్పుడూ వారి అభీష్టాలను తాహతునుబట్టి నెరవేర్చాలి.

Share this Story:

Follow Webdunia telugu