పిల్లలు లావుగా ఉంటే వారిని నిత్యం ఆహార పదార్థాల జోలికి వెళ్ళకుండా మీరు నివారించాలి. అలా చేస్తే వారు ఆహారాన్ని సరిగా తీసుకోవడానికి అలవాటు పడుతారు. ఇలా చేయడం కేవలం తల్లిదండ్లులకుమాత్రమే సాధ్యమవుతుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.
వారికి తగిన పోషక విలువలతోకూడిన ఆహార పదార్థాలను ఇవ్వడంతోబాటు ప్రతిరోజూ వ్యాయామాన్నికూడా అలవాటు చేయండి. మీరు చేయించే వ్యాయామంలో నిత్యం వాకింగ్, జాగింగ్ ఉండేలా అలవాటు చేయండి. దీంతో పిల్లలు సన్నగా, నాజూకుగా మారడానికి అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
కాని తల్లిదండ్రులుగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే పిల్లలు లావుగా ఉంటే వారిని ఎప్పుడూకూడా విమర్శించకండి. వారిని ప్రోత్సహిస్తూ..మీరుకూడా వ్యాయామం చేయడానికి వారిని మీ వెంట తీసుకువెళ్ళాలని వైద్యులుసూచిస్తున్నారు.