పిల్లలతో ఎంతసేపు గడుపుతున్నామన్నది కాదు ప్రధానం. వారితో ఎలా గడిపామనేది ముఖ్యం అని అంటున్నారు పరిశోధకులు. మీరు గడిపిన అరగంటైనాకూడా వారికి సంతృప్తినిచ్చిందా లేదా అనేది ముఖ్యం.
కుటుంబ సభ్యులతో గడపడం అంటే కార్యాలయంనుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోవడమనే అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. కానీ వెళ్ళగానే టీవీముందు లేకపోతే కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు కూర్చొని తమ పని తాము చేసుకోవడంకాదు. మీరు పిల్లలతో గడిపే గంట లేక అరగంటైనాకూడా వారితో ఆనందంగా, ఉల్లాసంగా గడపాలి. దీనిని క్వాలిటీ టైమ్ అంటారు పరిశోధకులు. పిల్లలకు ఇష్టమైన కథలు, వారికిష్టమైన పనులు చేస్తూ, వారు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలి. అప్పుడు వారి మనసులో మీరంటే ఓ ప్రత్యేకత చోటు చేసుకుంటుంది.
ఎప్పుడూకూడా మీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చకూడదు. దీనివలన పిల్లల్లో ఎదుటివారిపై ఈర్ష్యా భావాలు పెరిగి అది క్రమంగా ద్వేషంగా మారిపోతుంది. కాబట్టి పిల్లలను వారిని వారిగానే పెరగనివ్వాలంటున్నారు పరిశోధకులు.