రకరకాల ఆహార పదార్థాలు వివిధ రంగులలోవుంటే పిల్లల్ని చాలా బాగా ఆకర్షిస్తాయి. ఇలాంటి ఆహార పదార్థాలనే పిల్లలు ఎక్కువగా ఇష్ట పడుతారు. ఇందులో అడిటివ్స్ చేర్చడం వల్లనే ఇవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని చూడగానే పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకుకూడా నోరూరుతుంది మరి. అయితే రంగులు కలిపిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు వైద్యులు.
ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ కలిగివున్న ఆహార పదార్థాలు నేడు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. ఇందులో విషకారకాలున్న డెస్టర్, మింట్స్, షుగర్ ఫ్రీ కార్బోనేటెడ్ వాటర్, కార్బోనేటెడ్ డ్రింక్స్ లాంటివి మచ్చుకు ఉదాహరణ మాత్రమే. వీటిలో ఆస్పార్‌టేమ్ ఉంటుంది.
కన్ఫెక్షనరీ దుకాణాలలోకూడా ఆర్టిఫిషియల్ స్వీటనర్స్‌ను అధికమొత్తంలో వాడుతుంటారు. ఉదాహరణకు..కుల్ఫీ ఐస్, కేక్స్, ఐస్ క్రీమ్స్, కలాఖండ్, చూయింగ్‌గమ్, కేకులు మొదలైనవి.
వీటిని తింటే బ్లడ్ క్యాన్సర్, లుకేమియా, డయాబెటీస్, డిప్రెషన్, ప్రవర్తనాపరమైన లోపాలు తలెత్తుతాయంటున్నారు వైద్యులు. వీటిని స్వీట్ పాయిజన్‌గా కూడా పేర్కొంటున్నారు వైద్యులు.
ఇలాంటి రకాలు చైనీస్ ఫుడ్స్ లోకూడా ఉపయోగిస్తారంటున్నారు వైద్యులు. ఉదాహరణకు ప్యాకేజ్డ్ సూప్స్, సలాడ్ డ్రెసింగ్స్, చిప్స్, ఫ్రోజన్ ఫుడ్స్ లోకూడా అధికంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో అడిటివ్స్ ఉంటాయని, ఇవి పిల్లల ఆరోగ్యానికి విషతుల్యాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.