పరీక్షల కాలంలో పిల్లలపై అతి జాగ్రత్త ప్రమాదకరం..!!
* పరీక్షల కాలంలో పిల్లలకంటే తల్లిదండ్రులు నానా హైరానా పడిపోయి, పిల్లల్ని హైరానాకి గురి చేయటం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల పెంపకం విషయంలో అతి జాగ్రత్త లేదా అజాగ్రత్తగా వ్యవహరించే తల్లిదండ్రులు పనిగట్టుకుని వారి మెదడు ఎదుగుదలను అడ్డుకుని, మానసిక రోగులుగా మార్చేస్తున్నారని వైద్యులు వాపోతున్నారు.* పరీక్షలంటే పిల్లలకే కాదు. పిల్లలతో తమ సాన్నిహిత్యాన్ని పెంచుకునేందుకు తల్లిదండ్రులకూ పెద్ద పరీక్షే. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు తాము హైరానా పడి పిల్లల్ని టెన్షన్ పెట్టకూడదు. కంగారు పడవద్దని, నిదానంగా చదవమని సూచించాలి. పరీక్షలకు చదువుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులు నైతిక మద్దతు ఇవ్వాలి. అంతే తప్ప పక్క పిల్లలతో పోలికలు తెచ్చి కించ పరచకుండా, పిల్లల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేయాలి. * పిల్లల పంపకంపై అతి జాగ్రత్త లేదా అజాగ్రత్త ప్రదర్శించే తల్లిదండ్రులు తాము చేసిన పొరపాట్ల పర్యవసానాలు పిల్లలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయనే సంగతి ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రుల వ్యవహార శైలి కేవలం పిల్లల మానసిక లక్షణాలనే కాకుండా వారి మెదడు నిర్మాణాన్నీ ప్రభావితం చేస్తుందని దీంతో పిల్లలు మానసిక వ్యాధుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.