పరీక్షలకు వెళ్లే ముందు ఏం చేయాలి..?
* పరీక్షకు వెళ్లేముందు పిల్లలు అరటిపండు లేదా ఆపిల్‌ను తిని వెళ్లాలి. వీటిలో ఉండే పొటాషియం మెదడును చురుకుగా ఉంచుతుంది. నూనె తక్కువగా వాడిన ఇడ్లీ, ఉప్మా, దోశ, వెజిటబుల్ శాండ్‌విచ్‌లు సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి పరీక్షకు వెళ్లేముందు వీటిని లైట్‌గా తీసుకుంటే కడుపు తేలికగా ఉండి, యాక్టివ్‌గా ఉంటారు.* ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్డులో పసుపు పదార్థాన్ని తీసివేసి తింటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. చదువుకునే గంటకు ముందే భోంచేయటం పూర్తి చేయాలి. రాత్రిళ్లు చదువుకుంటే టీలు, కాఫీలు లాంటివి కాకుండా, గోరువెచ్చటి నీటితో తేనె కలుపుకుని తాగితే సరిపోతుంది.* ఆక్యుప్రెజర్ పద్ధతితో ఒక బొటనవేలును మరో బొటనవేలుతో నెమ్మదిగా ఒత్తటంవల్ల మెదడు ఉత్తేజితమై ఏకాగ్రత పెరుగుతుంది. ఎక్కువసేపు చదువుకునేవాళ్లు మధ్యమధ్యలో ఇలా చేయటం మంచిది. యోగాలో అయితే సర్వాంగాసనం, శీర్షాసనం, పద్మాసనం, వజ్రాసనం, సేతు ఆసనాలు మెదడుకి సరైన మోతాదులో ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఫలితంగా మెదడు చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి రోజూ ఇరవై నిమిషాలు ఈ ఆసనాలను వేయటం మంచిది.