Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లి అనారోగ్యంగా ఉంటే పాలు పట్టవచ్చా..?

Advertiesment
చైల్డ్ కేర్
FILE
* చంటిపిల్లల తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమె పిల్లలకు పాలు ఇవ్వకూడదు. రక్తస్రావం అధికంగా అవుతున్నప్పుడు, జ్వరం లేదా ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడినప్పుడు బిడ్డకు పాలు ఇవ్వకుండా తల్లి దూరంగా ఉంచటమే శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

* ముఖ్యంగా ప్రసవం అయిన తరువాత కొన్నిరకాల మందులను తప్పనిసరిగా వాడతున్నప్పుడు.. టీబీ, క్యాన్సర్, థైరాయిడ్ లాంటి వ్యాధుల నివారణకు మందులు వాడుతున్నప్పుడు.. వాటి ప్రభావం తల్లిపాల ద్వారా బిడ్డకు సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటివారు పిల్లలకు పాలు ఇవ్వకుండా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

* అయితే ఎలాంటి అనారోగ్యం లేని తల్లి తన పాలను పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలా పుట్టినప్పటినుంచే తల్లిపాలను పిల్లలకు ఇవ్వటం ద్వారా చర్మవ్యాధులు, చిన్నతనంలో వచ్చే అనేక రకాల వ్యాధుల బారినుంచి శిశువులను రక్షించుకోవచ్చు. పిల్లల్లో యాంటీ అలర్జిటిక్ ఫ్యాక్టర్స్‌ను పెంపొందించే విశిష్ట గుణం తల్లిపాలకు ఉంది. అందుకనే పోతపాల జోలికి వెళ్లకుండా పిల్లలకు తల్లిపాలు ఇవ్వటం ఉత్తమం.

Share this Story:

Follow Webdunia telugu